GDS Recruitment 2021: తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో 3446 పోస్టల్ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
మీరు టెన్త్ పాసయ్యారా? పదో తరగతిలో మాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష(తెలుగు)లో మంచి మార్కులు సాధించారా? అయితే మీకిది శుభవార్తే. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న డాక్ సేవక్(GDS) సోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విద్యార్హతలు..
అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. దీంతో పాటు మాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాషలో మంచి మార్కులు సాధించాలి. వయస్సు జనవరి 27 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. SC/ST అభ్యర్థులకు ఐదేళ్లు, OBC అభ్యర్థులకు మూడేళ్లు, PWD అభ్యర్థులకు పదేళ్లు వయో సడలింపు ఇచ్చారు. ఇతర వివరాలు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. దీంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. స్థానిక భాషలో మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల విద్యార్హతలు, పదో తరగతిలో గణితం, ఆంగ్ల సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జనరల్ కేటగిరి అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్‌ఉమెన్, PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేది ఫిబ్రవరి 26.
ఎలా అప్లై చేసుకోవాలంటే..
అభ్యర్థులు మూడు స్టేజ్ లలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి స్టేజ్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండవ స్టేజ్ లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ ను ఆన్లైన్ లో తేదా హెడ్ పోస్టాఫీసుల్లో ఆఫ్ లైన్ లో చెల్లించవచ్చు. అనంతరం మూడో స్టేజ్ లో అప్లికేషన్ ఫామ్ నింపాల్సి ఉంటుంది. అనంతరం డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి. అనంతరం మనకు కావాల్సిన పోస్టు ప్రాధాన్యతలు ఇవ్వాలి. అనంతరం ఓ సారి మనం నమోదు చేసిన వివరాలను సరి చూసుకుని ప్రింట్ తీసుకోవాలి. కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ చూడడం తో పాటు అప్లై చేయవచ్చు.
Also Read: TCS NQT 2021 Recruitment Drive For Freshers
Where is the link? Please send me.
ReplyDeleteHi there! Official website link-- https://appost.in/gdsonline/(We mentioned in the Post as well Please Refer it).
DeleteThanks for your Comment.