NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 16, 2021

Army Recruitment Rally 2021

  SSK       Jan 16, 2021

 Army Recruitment Rally: ఆర్మీ ఉద్యోగాలకు తెలంగాణలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... అప్లై చేయండిలా

Army Recruitment Rally 2021 | తెలంగాణలోని హకీంపేటలో ర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగబోతోంది. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

Army_Recruitment_Rally_2021

ఆర్మీలో ఉద్యోగం చేయాలనుకునేవారి అద్భుతమైన అవకాశం వచ్చేసింది. తెలంగాణలోని హకీంపేటలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది ఇండియన్ ఆర్మీ. జనవరి 18 నుంచి సికింద్రాబాద్‌లో కూడా రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. సికింద్రాబాద్‌తో పాటు హకీంపేటలో కూడా రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది ఇండియన్ ఆర్మీ. మార్చి 5 నుంచి 24 వరకు హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో ఈ ర్యాలీ జరగనుంది. ఈ ర్యాలీలో పాల్గొనడానికి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 19న ప్రారంభమవుతుంది. అప్లై చేయడానికి ఫిబ్రవరి 17 చివరి తేదీ. ఈ ర్యాలీకి సంబంధించిన అర్హతలు, ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ర్యాలీలో పాల్గొనడానికి ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో తెలుసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి.

Army Recruitment Rally Hakimpet 2021: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి ఇలా రిజిస్టర్ చేయండి

  • అభ్యర్థులు ముందుగా http://www.joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • JCO/OR ఎన్‌రోల్‌మెంట్‌లో Apply /Login పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి.
  • అభ్యర్థుల వివరాలన్నీ ఎంటర్ చేయాలి.
  • సేవ్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  • ఆ తర్వాత లాగిన్ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
  • డ్యాష్ బోర్డ్‌లో పోస్టును ఎంచుకొని నియమనిబంధనలన్నీ పూర్తిగా చదవాలి.
  • వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసి సేవ్ చేసి కంటిన్యూ చేయాలి.
  • ఆ తర్వాత కమ్యూనికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
  • స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటా వర్తిస్తే ఆ వివరాలు ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
  • విద్యార్హతల వివరాలు, మార్కులు ఎంటర్ చేయాలి.
  • ఓసారి మీ వివరాలన్నీ సరిచూసుకొని సబ్మిట్ చేయాలి.
  • అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత రోల్ నెంబర్ జనరేట్ అవుతుంది.
  • దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
  • ర్యాలీకి 10 నుంచి 15 రోజుల ముందు లాగిన్ అయి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
  • ర్యాలీ జరిగే తేదీ, సమయం, వేదిక, నియమనిబంధనలు, ఇతర వివరాలన్నీ అడ్మిట్ కార్డులో ఉంటాయి.

logoblog

Thanks for reading Army Recruitment Rally 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...