NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Jan 16, 2021

DRDO Recruitment 2021

  SSK       Jan 16, 2021

 DRDO Jobs 2021: డీఆర్‌డీఓలో 69 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

DRDO Jobs 2021 | ఉద్యోగాల భర్తీకి డీఆర్‌డీఓ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

DRDO_Recruitment_2021
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్‌స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-IRDE కోసం 69 పోస్టుల్ని ప్రకటించింది. ఇంజనీర్, టెక్నీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 69 ఖాళీలున్నాయి. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లో ఈ పోస్టులకు అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://drdo.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అభ్యర్థులు ముందుగా https://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ట్రేడ్ అప్రెంటీస్‌లు అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ పోర్టల్ https://apprenticeshipindia.org/ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి.

DRDO Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం ఖాళీలు- 69

  • మెషినిస్ట్- 2
  • టర్నర్- 2
  • ఫిట్టర్- 5
  • ఎలక్ట్రానిక్ మెకానిక్- 8
  • కంప్యూటర్ ఆపరేటర్ కమ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 3
  • డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్- 10
  • డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 16
  • డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్- 5
  • నర్సింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ- 2
  • గ్రాడ్యుయేషన్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్- 2
  • గ్రాడ్యుయేషన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 7
  • గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్- 7

DRDO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తుకు చివరి తేదీ- నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజులు
  • విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు.
  • స్టైపెండ్- టెక్నీషియన్లకు రూ.7000, డిప్లొమా అప్రెంటీస్‌కు రూ.8000, టెక్నీషియన్ అప్రెంటీస్‌కు రూ.9000
  • దరఖాస్తు పంపాల్సిన మెయిల్ ఐడీ- cao@irde.drdo.in
  • దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:Director, IRDE,Raipur,Dehradun-248008

logoblog

Thanks for reading DRDO Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...