NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Nov 26, 2020

SBI Jobs 2020:

  NewNotifications       Nov 26, 2020

 తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌బీఐలో 1080 ఉద్యోగాలు జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే

SBI Apprentice Recruitment 2020 | బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి అద్భుతమైన అవకాశం ఇది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI 8500 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోండిc

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇటీవల ఏకంగా 8500 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. రెండు తెలుగు రాష్ట్రాల్లో 1080 పోస్టులున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వారీగా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి డిసెంబర్ 10 వరకు అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో Careers సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏఏ జిల్లాల్లో ఎస్‌బీఐ ఎన్ని అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోందో తెలుసుకోండి.

తెలంగాణలో మొత్తం ఖాళీలు- 460

ఆదిలాబాద్ -10

భద్రాద్రి కొత్తగూడెం -21

జగిత్యాల -9

జనగాం -10

జయశంకర్ -12

జోగులంబా -9

కామారెడ్డి -16

కరీంనగర్ - 14

ఖమ్మం - 24

కొమరంభీమ్ -7

మహాబూబాబాద్ -12

మహబూబ్‌నగర్ -33

మల్కాజ్‌గిరి -5

మంచిర్యాల -8

మెదక్ -14

నాగర్‌కూర్నూల్ -15

నల్గొండ -22

నిర్మల్ -11

నిజామాబాద్ -39

పెద్దపల్లి -10

రంగారెడ్డి -22

సంగారెడ్డి -20

సిద్దిపేట -17

సిరిసిల్ల -6

సూర్యపేట -28

వికారాబాద్ -23

వనపర్తి -12

వరంగల్ -4

వరంగల్ రూరల్-11

యాదాద్రి భువనగిరి -16

SBI Jobs 2020: డిగ్రీ పాసైనవారికి ఎస్‌బీఐలో 8500 జాబ్స్. ఎంపిక విధానం ఇదే

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 620

శ్రీకాకళం- 33

విజయనగరం- 29

విశాఖపట్నం- 44

తూర్పుగోదావరి- 62

పశ్చిమ గోదావరి- 75

కృష్ణా- 53

గుంటూరు- 75

ప్రకాశం- 47

నెల్లూరు- 37

చిత్తూరు- 43

కడప- 51

అనంతపూర్- 28

కర్నూలు- 4

SBI Apprentice Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


నోటిఫికేషన్ విడుదల- 2020 నవంబర్ 20

దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 20

దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 10

విద్యార్హతలు- 2020 అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేయొచ్చు.

వయస్సు- 2020 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- రాతపరీక్ష, స్థానిక భాషలో పరీక్ష.

స్టైపెండ్- మొదటి ఏడాది నెలకు రూ.15,000. రెండో ఏడాది నెలకు రూ.16,500. మూడో ఏడాది నెలకు రూ.19,000. ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ ఉండవు.

official website

logoblog

Thanks for reading SBI Jobs 2020:

Previous
« Prev Post

No comments:

Post a Comment