NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Oct 9, 2020

UPSC Geo-Scientist Recruitment 2021

  NewNotifications       Oct 9, 2020

UPSC Geo-Scientist Recruitment 2021

యూపీఎస్‌సీ పలు పోస్టుల భర్తీకి కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

UPSC Geo-Scientist Recruitment 2021

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ జియో సైంటిస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ బీ, కెమిస్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ. జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్ పోస్టులు ఖాళీ లేనందున వాటిని నోటిఫై చేయలేదు. ఈ ఎగ్జామినేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలున్నాయో లేదో తెలుసుకోవాలి.

UPSC Geo-Scientist Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే

మొత్తం ఖాళీలు- 40

సైంటిస్ట్ బీ (హైడ్రోజియాలజీ) గ్రూప్ ఏ- 16

కెమిస్ట్, గ్రూప్ ఏ- 15

సైంటిస్ట్ బీ (జియో ఫిజిక్స్) గ్రూప్ ఏ- 6

సైంటిస్ట్ బీ (కెమికల్) గ్రూప్ ఏ- 3

UPSC Geo-Scientist Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

  • దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 7
  • దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 27 సాయంత్రం 6 గంటలు
  • దరఖాస్తు విత్‌డ్రాకు అవకాశం- 2020 నవంబర్ 4 నుంచి 10 సాయంత్రం 6 గంటల వరకు
  • విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
  • వయస్సు- 2021 జనవరి 1 నాటికి 21 నుంచి 32 ఏళ్లు
  • దరఖాస్తు ఫీజు- రూ.200. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.
  • ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ.

  1. అభ్యర్థులు ముందుగా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  2. హోమ్ పేజీలో ONLINE APPLICATION FOR VARIOUS EXAMINATIONS OF UPSC లింక్ పైన క్లిక్ చేయాలి.
  3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో COMBINED GEO-SCIENTIST (Preliminary) EXAMINATION పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  4. పార్ట్ 1 రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
  5. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

logoblog

Thanks for reading UPSC Geo-Scientist Recruitment 2021

Previous
« Prev Post

No comments:

Post a Comment

More ...