NewNotifications

New Notifications Updates-Get Latest All Job Notifications,Results,Time Tables,Exam Keys and It Releated jobs privided

More ...

Oct 2, 2020

Jobs in army public school

  NewNotifications       Oct 2, 2020

Army Public School Jobs-ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 ఉద్యోగాలు. విద్యార్హతలు ఇవే

ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకుంటున్నారా? టీచర్ లేదా లెక్చరర్‌గా కెరీర్ ఎంచుకోవాలనుకుంటున్నారా? మీకు శుభవార్త. ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో 8000 వరకు ఖాళీల భర్తీ జరగనుంది. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ-AWES జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రతీ ఏటా ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 8000 పోస్టుల భర్తీ జరుగుతుంది. ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో అవసరాలను బట్టి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ పోస్టుల సంఖ్య వెల్లడించలేదు. ఆయా స్కూళ్లు ఇంటర్వ్యూ నిర్వహించే సమయంలో పోస్టుల సంఖ్యను వెల్లడిస్తాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT, ప్రైమరీ టీచర్-PRT పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ. మూడు దశల పరీక్షల ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు సీటెట్ లేదా టెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://aps-csb.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు అప్లై చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
Army_Jobs

మొత్తం ఖాళీలు- సుమారు 8000
భర్తీ చేసే పోస్టులు- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్-TGT, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్-PGT, ప్రైమరీ టీచర్-PRT
దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 1దరఖాస్తుకు చివరి తేదీ- 2020 అక్టోబర్ 20
అడ్మిట్ కార్డుల విడుదల- 2020 నవంబర్ 4
స్క్రీనింగ్ టెస్ట్- 2020 నవంబర్ 21 లేదా 22
స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాల విడుదల- 2020 డిసెంబర్ 2

విద్యార్హత- పీజీటీ పోస్టుకు ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 50 శాతం మార్కులతో పాస్ కావాలి. బీఈడీ కూడా 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇక టీజీటీ పోస్టుకు ఏదైనా డిగ్రీలో, బీఈడీలో 50 శాతం మార్కులతో పాస్ కావాలి. ఇక పీఆర్‌టీ పోస్టుకు 50 శాతం మార్కులతో డిగ్రీ పాస్ కావడంతో పాటు బీఈడీ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. సీటెట్ లేదా టెట్ అవసరం లేదు.

వయస్సు- ఫ్రెషర్స్‌కు 40 ఏళ్ల లోపు, అనుభవజ్ఞులకు 57 ఏళ్ల లోపు.
దరఖాస్తు ఫీజు- రూ.500
ఎంపిక విధానం- స్క్రీనింగ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ.
logoblog

Thanks for reading Jobs in army public school

Previous
« Prev Post
Oldest
You are reading the latest post

No comments:

Post a Comment

More ...